ntr: 'జనతా గ్యారేజ్' కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టేనా?

ప్రస్తుతం ఎన్టీఆర్ ..బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ సినిమాను కూడా పూర్తిచేసి, వచ్చే వేసవిలో కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ తో త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా ముందుగా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు.

 అందువలన ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి త్రివిక్రమ్ కి మరింత ఆలస్యం కానుంది. ఆ ప్రభావం కొరటాలతో ఎన్టీఆర్ చేయాలనుకున్న సినిమాపై పడనుంది. అందువలన ఎన్టీఆర్ కంటే ముందుగా చరణ్ తో సినిమా చేయడానికి కొరటాల రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ విషయాన్ని గురించి ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ తో చెప్పినట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఇక కొరటాలతో ఎన్టీఆర్ మూవీ 2019 లోనే పట్టాలెక్కుతుందన్న మాట.   

ntr

More Telugu News