: చైనా రాయబారిని కలిసినట్టు రాహుల్ ఒప్పుకోలు.. ప్రెస్ రిలీజ్‌ను డిలీట్ చేసిన చైనా!

చైనా రాయబారి లువో ఝావోను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలవడంతో సోమవారం దోబూచులాట చోటు చేసుకుంది. చైనా రాయబారిని రాహుల్ కలుసుకున్నట్టు వచ్చిన వార్తలను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ఖండించింది. అయితే ఆ తర్వాత కాసేపటికే రాహుల్ మాట్లాడుతూ, జూలై 8న తాను చైనా రాయబారిని కలుసుకున్నట్టు తెలిపారు. ఇందులో దాపరికం ఏమీ లేదని, సాధారణ భేటీలో భాగంగానే ఆయనను కలిసినట్టు వివరించారు.

దీంతో ఇద్దరి మధ్య భేటీ జరిగిందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం దొరికినా, చైనా మాత్రం తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ప్రెస్ రిలీజ్‌ను డిలీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ప్రెస్ నోట్‌లో.. జూలై 8న లువో ఝావోను రాహుల్ గాంధీ కలిశారని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాలు, వాణిజ్య వ్యవహారాలపై చర్చించినట్టు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలిసినట్టు వస్తున్న వార్తలపై దుమారం చెలరేగడంతో తర్వాత ఆ ప్రెస్ రిలీజ్‌ను వెబ్‌సైట్ నుంచి చైనా తొలగించింది. అయితే ఎందుకు తొలగించిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

More Telugu News