: భక్తులతో పోటెత్తిన సాయిబాబా ఆలయాలు... మహంకాళి అమ్మవారి సన్నిధిలో వీఐపీలు!

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచే ఆలయాలను తెరవగా, భక్తులు పెద్ద సంఖ్యలో సాయిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని దివ్యక్షేత్రం షిర్డీలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతుండగా, భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని సాయి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట సాయిబాబా ఆలయాల వద్ద భక్తుల క్యూ లైన్ కిలోమీటర్ కు పైగా కొనసాగుతోంది.

మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ప్రారంభమైంది. తొలి బోనాన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాసయాదవ్ దంపతులు సమర్పించారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల పండగకు 2500 మందితో భధ్రత నిర్వహిస్తున్నామని, 120 సీసీ కెమెరాలు, షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేశామని అధికారులు ప్రకటించారు. బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించినట్టు తెలిపారు.

More Telugu News