: బుర్హాన్‌ వనీ ప్రథమ వర్థంతి... ఈ రోజు నుంచి జమ్ముకశ్మీర్ లో సోషల్‌ మీడియా బంద్‌!

జమ్మూకశ్మీర్‌లో గ‌త ఏడాది  హిజ్బుల్ ఉగ్ర‌వాది బుర్హాన్‌ వనీని భార‌త సైన్యం మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. ఆ ఉగ్ర‌వాది ప్రథమ వర్థంతి ఈ వారాంతంలోనే ఉన‍్న నేప‌థ్యంలో ఎటువంటి ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోకుండా అధికారులు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌లను బంద్ చేయ‌నున్నారు. తిరిగి ఆదేశాలిచ్చే వరకు వాటిని పున‌రుద్ధ‌రించవ‌ద్ద‌ని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను వేదికగా యువ‌త‌ను రెచ్చ‌గొడుతూ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ కార‌ణంగానే ఆ సేవలను నిలిపివేయిస్తున్నారు. ఒక‌వేళ సోషల్‌ మీడియా సైట్‌లను మూసి వేయటం సాధ్యంకాక‌పోతే ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేయాలని అధికారులు సర్వీస్‌ ప్రొవైడర్లకు సూచించారు. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఇప్ప‌టికే భద్రతా బలగాల‌ను మోహ‌రింప‌జేశారు. గ‌తేడాది జూలై 8న బుర్హాన్ హ‌తం కావ‌డంతో కశ్మీర్‌లో క‌ల్లోల ప‌రిస్థితులు చెలరేగి, సుమారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News