: యూపీ సీఎం స్నేహితుడికి బెదిరింపులు!

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్నేహతుడు డాక్టర్ ఎస్ఎస్ షాహిని ఓ గూండా బెదిరిస్తూ ఫోన్ చేశాడు, తనకు వెంటనే రూ.20 లక్షలు ఇవ్వని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. గోరఖ్ పూర్ లో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే షాహికి గత నెల 28, 29 తేదీల్లో సదరు గూండా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై షాహి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు రామాశ్రయ్ యాదవ్ అని, డియోరియా జిల్లా జైలు నుంచి మాట్లాడుతున్నానని, తనకు ఇరవై లక్షల రూపాయలు తక్షణం చెల్లించాలని బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో, ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. గోరఖ్ పూర్ జిల్లా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సంజయ్ యాదవ్ ఈ ఫోన్ చేసినట్టు తేలింది. కాగా, ఈ సంఘటనపై యూపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. షాహికి గట్టి భద్రత ఏర్పాటు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో సీనియర్ ఎస్పీ ఆర్పీ పాండేను బదిలీ చేసింది. ఆయన స్థానంలో అమిత్ కుమార్ పాఠక్ కు నియమించింది.

More Telugu News