: చాంపియన్స్ ట్రోఫీ విజయం ఫలితం.. టెస్ట్ కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్

చాంపియన్స్ ట్రోఫీ విజయం ఫలితం పాక్ వన్డే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ కెప్టెన్‌ను చేసింది. విండీస్ టూర్ తర్వాత పాక్ టెస్ట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ రిటైర్ కానుండడంతో ఆయన స్థానంలో సర్ఫరాజ్‌ను నియమిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. టెస్ట్ కెప్టెన్సీని సర్ఫరాజ్ అంగీకరించినట్టు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. తనను టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సర్ఫరాజ్ తెలిపాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టును ముందుకు నడిపించడానికి, విజయాలు అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. 2016లో పాకిస్థాన్‌కు అండర్ -19 ప్రపంచ కప్ అందించిన సర్ఫరాజ్ తాజాగా చాంపియన్స్ ట్రోఫీ అందుకుని హీరోగా మారాడు. 1992 ప్రపంచ కప్ తర్వాత పాక్ ఐసీసీ కప్ అందుకోవడం ఇదే తొలిసారి.

More Telugu News