: కోహ్లీకి గంగూలీ మద్దతు పలుకుతున్నాడా? కుంబ్లేను మరీ ఇంతలా అనేశాడేంటి?

టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్ లో కలకలం రేపుతున్నాయి. గతంలో కుంబ్లే-కోహ్లీ మధ్య విభేదాలను బీసీసీఐ సకాలంలో పరిష్కరించలేదని చెప్పిన గంగూలీ తాజాగా ఆ వివాదంపై మాట్లాడుతూ, కోచ్ కి నైపుణ్యం మాత్రమే ఉంటే సరిపోదని, వ్యక్తులతో వ్యవహరించాల్సిన విధానం కూడా తెలిసుండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అనేది పూర్తిగా కెప్టెన్ గేమ్ అని స్పష్టం చేసిన గంగూలీ...కోచ్ పని గేమ్ ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడడమే అని చెప్పాడు.

 చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన గొప్ప కోచ్ కాలేరని, ముందు వ్యక్తులతో ఎలా మెలగాలో తెలిసి ఉండాలని చెప్పాడు. భారత జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు తమ వంతు సాయం చేస్తామని గంగూలీ తెలిపాడు. కుంబ్లే పదవి నుంచి తప్పుకున్న తరువాత గంగూలీ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అవమానకరంగా కుంబ్లే రాజీనామాను ఆమోదించడమే కాకుండా కుంబ్లేపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. 

More Telugu News