: కశ్మీర్ లో భారత్ చేస్తున్న దారుణాలు అమెరికాకు కనబడటం లేదా?.. కశ్మీర్ అంశాన్ని వదలం: మండిపడ్డ పాకిస్థాన్

పాక్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తావివ్వరాదని, ముంబై దాడులు, పఠాన్ కోట్ దోషులను వెంటనే శిక్షించాలంటూ అమెరికాలో మోదీ, ట్రంప్ లు సంయుక్తంగా ప్రకటన చేయడం పట్ల పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా యూఎస్ ప్రకటించడం పాక్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. ఈ నేపథ్యంలో అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందంటూ పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి నిస్సార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాశ్మీర్ లో అమాయకులను భారత్ పొట్టనపెట్టుకుంటోందని... భారత్ చేస్తున్న అరాచకాలను అమెరికా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కశ్మీర్ అంశాన్ని తాము వదిలేయబోమని... అంతర్జాతీయంగా ప్రతి వేదికపై ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని చెప్పారు. కశ్మీర్ లో హక్కుల కోసం పోరాడుతున్న వారిపై టెర్రరిస్టు ముద్ర వేయడం దారుణమని అన్నారు. కశ్మీర్ ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News