: భారత ప్రధాని మీ జేబులో ఉండాలని కోరుకుంటున్నారా? నెదర్లాండ్స్‌లోని ఎన్‌ఆర్‌ఐలను ప్రశ్నించిన మోదీ

నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడి ఎన్నారైలను ఓ ప్రశ్న అడిగారు. ‘‘భారత ప్రధాని మీ జేబులో ఉండాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. ప్రధానితో సులభంగా టచ్‌లో ఉండేలా రూపొందించిన ‘నమో’ యాప్‌ను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వారిని కోరారు. దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తాను నిత్యం వారి జేబులోనే ఉంటానని పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడగడం ద్వారా తమ ప్రభుత్వం టెక్నాలజీతో కూడిన అభివృద్ధికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో ప్రధాని నొక్కి వక్కాణించినట్టు అయింది.

 ఈ 21వ శతాబ్దంలో సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్ వెనకనే ఉండిపోదని స్పష్టం చేశారు. పేదలు, గ్రామీణ ప్రజలు కూడా సాంకేతిక ఫలాలను మొబైల్ ఫోన్స్ ద్వారా అందుకుంటే చూడాలని ఉందన్నారు. ‘‘చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా మీరు గంటైనా ఉండగలరా? అది చాలా కష్టం. భారతదేశం పేదదని అనుకోవద్దు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి వద్ద కూడా మొబైల్స్ ఉన్నాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో సాంకేతికత గణనీయమైన పాత్ర పోషిస్తుందని మోదీ స్పష్టం చేశారు.

More Telugu News