: భారత సైన్యం తమను అడ్డుకుంటోందంటూ గగ్గోలు పెడుతున్న చైనా మిలటరీ!

తన భూభాగంలో భారత్ ఆధిపత్యం చూపుతూ, అభివృద్ధి పనులను అడ్డుకుంటోందని భారత సైన్యంపై చైనా మండిపడింది. దీని కారణంగా సరిహద్దుల్లో శాంతి విఘాతం కలుగుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా రక్షణ శాఖ ప్రతినిధి రెన్ గువోక్వియాంగ్ ఓ ప్రకటన చేస్తూ, డాంగ్ లాంగ్ రీజియన్ లో తాము ఓ రహదారిని నిర్మిస్తుండగా, అది తమ ప్రాంతమంటూ భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొంది.

సిక్కిం పరిసరాల్లోని సరిహద్దు ప్రాంతంపై దశాబ్దాలుగా భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండియా భూభాగంలో రోడ్లను వేసేందుకు చైనా ప్రయత్నించడం తన సార్వభౌమత్వానికి ఎదురుదెబ్బగా భారత్ చెబుతుండగా, అది తమ భూభాగమని చైనా వాదిస్తోంది. తాము రోడ్డు వేస్తున్న సిక్కింలోని ప్రాంతం తమదేనని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం లిఖిత పూర్వకంగానూ అంగీకరించిందని రెన్ వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుకునే అధికారం భారత్ కు లేదన్నారు.

More Telugu News