: తెలంగాణ ఉద్యమం బాటలో గూర్ఖా యువత.. ఆత్మాహుతి, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరిక!

గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న గూర్ఖా జన్‌ముక్తి యువ మోర్చా (జీజేవైఎం) నిరసన పంథా మార్చేందుకు సిద్ధమవుతోంది. తమ ఆందోళన ప్రభుత్వంలో కదలికలు తెప్పించడంలో విఫలమవడంతో తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఆత్మాహుతి, నిరవధిక నిరాహార దీక్షలతో ప్రభుత్వంలో గుబులు పుట్టించాలని భావిస్తోంది. అలా చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తోంది. డిసెంబరు 2009 నుంచి మార్చి 2012 మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 15 మంది ఆత్మాహుతి చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జీజేవైఎం గుర్తు చేసింది. తమ శాంతియుత ఆందోళనలకు ప్రభుత్వాలు దిగిరాకుంటే ఆత్మాహుతి, నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని జీజేవైఎం అధ్యక్షుడు ప్రకాశ్ గురుంగ్ హెచ్చరించారు.

More Telugu News