: గూగుల్ ప్లే స్టోర్‌లో జేవియ‌ర్ మాల్‌వేర్‌.. జాగ్రత్త అంటున్న సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ

గూగుల్ ప్లే స్టోర్‌లోని దాదాపు 800ల‌కు పైగా అప్లికేష‌న్ల‌లో జేవియ‌ర్ అనే మాల్‌వేర్ ఉంద‌ని ప్ర‌ముఖ సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ ట్రెండ్ మైక్రో వెల్ల‌డించింది. యూజ‌ర్ స‌మాచారాన్ని నిశ్శ‌బ్దంగా త‌స్క‌రించే ఈ మాల్‌వేర్ ఫొటో మానిప్యులేట‌ర్‌, వాల్‌పేప‌ర్‌, రింగ్‌టోన్లు వంటి అప్లికేష‌న్ల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం వ‌ల్ల ప్ర‌వేశిస్తుంద‌ని కంపెనీ తెలిపింది. అలాగే దీన్ని అడ్డుకోవ‌డానికి తాము రూపొందించిన మ‌ల్టీ లేయ‌ర్ సెక్యూరిటీ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వివ‌రించారు.

స్ట్రింగ్ ఎన్‌క్రిప్ష‌న్‌, ఇంట‌ర్నెట్ డేటా ఎన్‌క్రిప్ష‌న్ వంటి వివిధ ర‌కాల ఆత్మ‌ర‌క్ష‌ణ స‌దుపాయాల‌తో త‌యారైన జేవియ‌ర్ మాల్‌వేర్ సోక‌కుండా ఉండాలంటే అప‌రిచిత డెవ‌ల‌ప‌ర్లు త‌యారుచేసే అప్లికేష‌న్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌ద్ద‌ని ట్రెండ్ మైక్రో ప్ర‌తినిధి నీలేశ్ జైన్ సూచించారు.

More Telugu News