: ఆరు గంటలపాట టెన్షన్... గాల్లో చక్కర్లు కొట్టిన హైదరాబాద్‌-ఢిల్లీ విమానం!

ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణికులు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొన్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్ లైన్స్ దేశీయ విమానం ఉదయం 9:40 నిమిషాలకు బయల్దేరింది. మధ్యాహ్నం 12 గంటలకే ఢిల్లీ చేరింది. అయితే, ఆ విమానం ల్యాండింగ్ కు సిబ్బంది అనుమతివ్వలేదు. దీంతో గంటకుపైగా విమానం ఢిల్లీ నగరంపై గాల్లోనే చక్కర్లు కొట్టింది.

ఇక ఇంధనం ఖాళీ అవుతుండడంతో విమానాన్ని పైలట్ జైపూర్‌ కు మళ్లించి, అక్కడ 1:40 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే, ప్రయాణికులను విమానం నుంచి కిందికి దిగేందుకు అనుమతివ్వలేదు. దీంతో అంతా విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఇంధనం నింపిన అనంతరం మళ్లీ 2:35 నిమిషాలకు జైపూర్ నుంచి విమానం ఢిల్లీ బయల్దేరింది. 3:30 నిమిషాలకు ఢిల్లీ చేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సుమారు 6 గంటలపాటు టెన్షన్ తో ప్రయాణికులు గడిపారు. ల్యాండింగ్ అనుమతి నిరాకరించడంతో లింక్ ప్రయాణం పెట్టుకున్న దేశ, విదేశీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. 

More Telugu News