: నిరుద్యోగులకు గూగుల్ సేవలు...ఇకపై ఉద్యోగ సమాచారం గూగుల్ లో?

సినీ రచయిత అన్నట్టు గూగుల్‌ తల్లిగా మారబోతోంది. ఏ విషయాన్నైనా క్షణాల్లో మనముందుంచే ఇంటర్నెట్‌ సెర్చింజన్ గూగుల్ ఇకపై నిరుద్యోగులకు నేరుగా సేవలందించనుంది. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న రుగ్మతల్లో నిరుద్యోగం ఒకటి. ప్రతి ఏటా ఎంతో మంది విద్యావంతులు డిగ్రీలు చేతపట్టుకుని బయటకు వస్తున్నారు. అయితే వారికి సరిపడినన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం లేదు. కొన్ని అవకాశాలు ఉన్నా...క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కాని విద్యార్థులకు అందులోకి ఎలా వెళ్లాలో తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సమాచారాన్ని గూగుల్ అందించేందుకు ముందుకు వస్తోంది. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం వెతికే వారికి గూగుల్ ఉద్యోగ సైట్లను మాత్రమే సూచించేది కానీ ఇక ముందు ఉద్యోగ వివరాలు, అనువైన ఉద్యోగం, నైపుణ్యం, కంపెనీల రేటింగ్స్‌, తదితర సమాచారం అందించనుంది. ఈ మేరకు లింక్డ్ ఇన్‌, మాన్‌ స్టర్‌, వే అప్‌, డైరెక్ట్‌ ఎంప్లాయర్స్‌, కెరీర్‌ బిల్డర్‌, గ్లాస్‌ డోర్‌, ఫేస్‌ బుక్‌ తదితర సంస్థలతో కలిసి బృందంగా ఏర్పడనుంది. వీటి సహకారంతో గూగుల్ నిరుద్యోగులకు అవసరమైన ఉద్యోగ సమాచారం అందించనుంది. 

More Telugu News