: ప్రతిపక్షాలు కూడా దళిత అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నిక బరిలోకి దింపితే మద్దతిస్తాం: మాయావతి

వచ్చేనెల 17న రాష్ట్రపతి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ముందే త‌మ అభ్య‌ర్థితో నామినేష‌న్ వేయించాల‌ని భావించిన ఎన్డీఏ ఈ రోజు త‌మ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్ ను ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఒక ద‌ళిత నేత‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే, రామ్‌నాథ్ కోవిద్ సంఘ్ భావజాలం ఉన్న వ్యక్తని ఆమె అన్నారు. ఆయన ఓ దళితుడు కాబట్టి ఈ అంశాన్ని తాము వ్యతిరేకించలేమని వ్యాఖ్యానించారు. విప‌క్షాలు కూడా మరో దళిత అభ్యర్థిని నిర్ణయిస్తే తాము వారికి మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామ‌ని ఆమె తెలిపారు. 

More Telugu News