: విశ్వాస పరీక్ష ఎదుర్కున్న కర్ణాటక శాసమండలి ఛైర్మన్.. ఒక్క ఓటు తేడాతో బీజేపీ నాయకుడి గెలుపు

కర్ణాటక శాసన మండలి చైర్మన్‌ డీహెచ్‌ శంకరమూర్తి (బీజేపీ నాయ‌కుడు)ని ఆ ప‌ద‌వినుంచి దించేందుకు కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. ఈ రోజు జ‌రిగిన విశ్వాస పరీక్షలో శంకర‌మూర్తి ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుపొంది, కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు. క‌ర్ణాట‌క శాస‌న మండ‌లిలో మొత్తం 75 మంది సభ్యులున్నారు. అలాగే ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. శంక‌రమూర్తి ఓటును మినహాయిస్తే బీజేపీలో 22 మంది స‌భ్యులున్నారు. ఇక అధికార‌ కాంగ్రెస్‌కు 32, జేడీఎస్‌కు 13 మంది సభ్యుల బలముంది. మరో ఐదుగురు ఇండిపెండెంట్ స‌భ్యులు. జేడీఎస్‌ మద్దతు బీజేపీకి ల‌భించ‌డంతో చైర్మన్‌ శంకరమూర్తికి అనుకూలంగా 37 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 36 ఓట్లు వ‌చ్చాయి. ఆ రాష్ట్ర శాస‌న‌మండ‌లిలో చైర్మన్‌ విశ్వాసపరీక్ష ఎదుర్కోవడం ఇదే మొట్ట మొద‌టిసారి.               

More Telugu News