: బంజారాహిల్స్ లో సందడి చేసిన సమంత... చూసేందుకు ఉత్సాహం చూపిన అభిమానులు

టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సందడి చేసింది. బంజారాహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వీకేర్ క్లినిక్ శాఖను ప్రారంభించింది. సమంత రానుందన్న సంగతి తెలిసిన ఆమె అభిమానులు అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆమెను చూసేందుకు వారంతా తహతహలాడడంతో ఆ ప్రాంతమంతా కోలహలంగా మారింది. ఆమె రాగానే అభిమానులు తమ ఫోన్లకు పని చెప్పారు. ఆమెను తమ సెల్ ఫోన్లలో బంధించారు. కాగా, సమంత సరికొత్త చేనేత వస్త్రాల్లో అభిమానులను అలరించింది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత ఈ మధ్యకాలంలో డిజైనర్ చేనేత దుస్తులు ధరించి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. 

More Telugu News