: గర్భిణులు ఆ కోరికకు దూరంగా ఉండాలి: ఆయుష్ మంత్రిత్వ శాఖ పుస్తకంలో సూచన

'మదర్ అండ్ చైల్డ్ కేర్' పేరిట ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ పుస్తకాన్ని ప్రచురించగా, అందులో గర్భిణీ స్త్రీలకు చేసిన పలు సూచనలు కొత్త చర్చకు తెరలేపాయి. గర్భం దాల్చిన స్త్రీలు శృంగార వాంఛలను నియంత్రణలో ఉంచుకోవాలని పుస్తకం సూచిస్తోంది. కోపానికి దూరంగా ఉండాలని, లైంగిక కోరికలు వద్దని, గుడ్లను, మాంసాహారాన్ని మానుకోవాలని ఉంది. ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్ న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. గర్భిణిలు నిద్రించే గదిలో అందమైన, ఆహ్లాదపరిచే పోస్టర్లను గోడలపై పెట్టుకోవాలని కూడా ఉంది. కాగా, గర్భిణిలు దాంపత్య జీవితాన్ని కొన్ని జాగ్రత్తలతో అనుభవిస్తే, సుఖ ప్రసవం జరుగుతుందని ఎంతో మంది వైద్యులు, నిపుణులు చెబుతుంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మదర్ అండ్ చైల్డ్ కేర్' పుస్తకంలోని సూచనలు కొత్త చర్చకు తెరలేపాయి.

More Telugu News