: ముందు రైతన్నను ఆదుకోండి... ఆ తరువాత సమర్థవంతమైన ప్రభుత్వమన్న పేరు తెచ్చుకుందురుగాని!: హీరో విజయ్ ఆగ్రహం

తమిళ ప్రముఖ నటుడు విజయ్ ఒక ప్రైవేటు కార్యక్రమంలో రైతులకు మద్దతుగా మాట్లాడి మరోసారి రాజకీయ ప్రవేశంపై ఆసక్తి రేపాడు. గతంలో విజయ్ బీజేపీలో చేరనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తరువాత ఆ వార్తలు సద్దుమణిగాయి. అయితే తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డాడు. సమర్థవంతమైన ప్రభుత్వంగా మారడం సంగతి పక్కనపెట్టి, ముందు అన్నదాతల పాలిట మంచి ప్రభుత్వంగా పేరుతెచ్చుకోవాలని సూచించాడు.

మనమంతా బాగానే ఉన్నామని చెప్పిన విజయ్... మనకు పట్టెడన్నం పెట్టే రైతన్న మాత్రం రేషన్ బియ్యం కోసం రేషన్ షాపు ముందు క్యూలో నిల్చున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కల్తీ ఆహారం గురించి మాట్లాడుకునే వారంతా అనారోగ్యకరమైన ఆహారాన్నే భుజిస్తున్నారని చెప్పిన విజయ్... రైతన్నను ఆదుకోకుంటే అంతా నాశనమవుతుందని చెప్పాడు. రైతుల జీవితాలు ఆనందంగా ఉండేలా చూడడం ప్రజలందరి కర్తవ్యమని అన్నాడు. మూడుపూటలా అన్నం దొరుకుతుండడంతో రైతుల బాధలు మనకు తెలియడం లేదని మండిపడ్డాడు.  

More Telugu News