: మలేషియాలో ఎండీఎంకే చీఫ్‌ వైగోకు చేదు అనుభవం

మ‌లేషియాలోని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఎండీఎంకే చీఫ్‌ వైగోను అక్క‌డి అధికారులు అడ్డుకున్నారు. ఎల్‌టీటీఈతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆయ‌న‌ను కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. ఎండీఎంకే చీఫ్‌ వైగో 2001లో ఎల్‌టీటీఈకి మద్దతు ప‌లుకుతున్న‌ట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న‌ వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలలు జైలు శిక్ష అనుభవించారు. అనంత‌రం 2009లో శ్రీలంకలో యుద్ధం జ‌రుగుతున్నప్పుడు కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ కేసులో ఆయ‌న విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

More Telugu News