: హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా పోలీసుల వలలో పడ్డ షహరాన్ పూర్ కల్లోల సూత్రధారి చంద్రశేఖర్

ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ ప్రాంతంలో ఇటీవలి కల్లోలాల వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 'భిమ్ ఆర్మీ' చీఫ్ చంద్రశేఖర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో చంద్రశేఖర్ దాగున్నాడని తెలుసుకున్న యూపీ పోలీసులు దాడులు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్న చంద్రశేఖర్, షహరాన్ పూర్ ప్రాంతంలో దళిత హక్కులను కాపాడేందుకంటూ భీమ్ ఆర్మీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 గత నెలలో జరిగిన అల్లర్ల వెనుక ఇతనే కుట్రదారుడని పోలీసులు తేల్చగా, 9వ తేదీన న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షమై భారీ ర్యాలీ నిర్వహించి, ఆపై కోర్టు ముందు లొంగిపోతానని చెప్పి మాయమయ్యాడు. ఆపై చంద్రశేఖర్ తో పాటు అతని అనుచరుల ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తే, నగదు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతన్ని పోలీసులు నేడు అరెస్ట్ చేశారు.

More Telugu News