: ఈ-మెయిల్ అమ్మాయిల స్కర్టులా ఉండాలట.. వివాదంలో ఢిల్లీ యూనివర్సిటీ పాఠ్యాంశం!

ఢిల్లీ యూనివర్సిటీలో పాఠ్యాంశం వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీలో కామర్స్ విద్యార్థుల 'బేసిక్ బిజినెస్ కమ్యూనికేషన్స్' పుస్తకంలోని 'ఈ మెయిల్ ఎటికిట్' అనే పాఠ్యాంశంలోని ఒక ప్రస్తావన లింగవివక్షను రేపిందంటూ వివాదం రేగింది. ప్రొఫెసర్ సీబీ గుప్తా రాసిన ఈ పాఠ్యాంశంలో ఈ మెయిల్ ఎలా ఉంటే బాగుంటుందో వివరిస్తూ...‘ఈ మెయిల్ మెసేజ్‌లు స్కర్టుల్లాగా ఉండాలి. అంత షార్టుగా ఉంటేనే ఆసక్తికరంగా ఉంటాయి. ఈమెయిల్స్ పెద్దగా ఉంటే అసలు విషయాలన్నీ మరుగున పడిపోతాయి’ అంటూ రచయిత వ్యాఖ్యానించారు. దీంతో వివాదం రేగింది. పాఠ్యాంశంలో మహిళలను కించపరిచారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠ్యాంశాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

More Telugu News