: అవినీతిలో అగ్రస్థానంలో భారత్‌.. చివరి స్థానంలో జపాన్!

అవినీతి విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉంద‌ని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ అనే సంస్థ స‌ర్వే ద్వారా వెల్లడైంది. మొత్తం 16 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భార‌త్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా జపాన్ చివ‌రి స్థానంలో ఉంది. ప్రభుత్వ కార్యాల‌యాల్లో పనులను చేయించుకోవ‌డం కోసం భారత్‌లో ప్రతి పదిమందిలో ఏడుగురు లంచాలు ఇచ్చినట్లు  ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ పేర్కొంది. భారత్, చైనాతో పాటు ఈ 16 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ప్రభుత్వ అధికారులకు మొత్తం 90 కోట్ల మంది ప్ర‌జ‌లు లంచాలు ఇచ్చుకున్న‌ట్లు అందులో తేలింది.

ఈ స‌ర్వేలో 16 దేశాల నుంచి 22వేల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. చైనాలోనూ గత మూడేళ్లలో అవినీతి పెరిగిపోయింది. అవినీతిని అరికట్టేందుకు త‌మ దేశ స‌ర్కారు సరైన చర్యలు తీసుకోవడం లేదని చైనీయులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు అవినీతిని నిర్మూలించేందుకు త‌మ తమ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని మ‌న‌దేశం స‌హా శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల ప్రజలు అన్నారు. కాగా, భారత పోలీసు అధికారుల్లో 54 శాతం, చైనాలో 12 శాతం అవినీతి ఉన్నట్లు స‌ర్వే ద్వారా తేలింది.                            

More Telugu News