: ఇలాంటి సినిమాలు చూడటానికి నేను రూ.10 కూడా ఖర్చుపెట్టను: బాహుబలి-2పై సీనియర్ దర్శకుడి విమర్శలు

దర్శకధీరుడు రాజమౌళి తీసిన‌ ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’పై భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌ యావ‌త్తూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో భార‌త్‌లో భారీ బడ్జెట్ సినిమాలు తీయ‌డానికి ఎంతో మంది నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్నారు. అయితే, కొంద‌రు మాత్రం ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించడాన్ని ఏ మాత్రం ప్ర‌శంసించ‌లేక‌పోతున్నారు. తాజాగా ప్రముఖ కథా రచయిత, సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్(75) ఓ కార్యక్ర‌మంలో మాట్లాడుతూ.. ‘బాహుబ‌లి-2’ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇలాంటి సినిమాలు చూడటానికి తాను రూ. 10 కూడా ఖర్చుపెట్టనని ఆదూర్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు.  అస‌లు ఈ సినిమాలో ఏముందని ప్ర‌శ్నించారు. 1951లో వచ్చిన ‘పాతాళ భైరవి’కి ఈ సినిమా కాపీ అని చెప్పారు. అంతేకాదు, ఇటువంటి చిత్రాల వల్ల సమాజంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. ఈ సినిమా వల్ల భారత సినీ పరిశ్రమకు ఒరిగిందేమీలేదని వ్యాఖ్యానించారు. రూ. 10 కోట్లతో మనం 10 సినిమాలు నిర్మించ‌వ‌చ్చ‌ని, అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇటువంటి వేస్ట్‌ సినిమాలు తీస్తున్నార‌ని అన్నారు.

More Telugu News