: ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న అరబ్ దేశాలు.. 6.5 లక్షల మంది భారతీయుల పరిస్థితిపై కేంద్రం ఆందోళన!

ఉగ్రవాదులకు ఊతం ఇస్తోందన్న ఆరోపణలతో ఖతర్‌తో అరబ్ దేశాలు సంబంధాలు తెంచుకున్నాయి. బెహ్రయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ఖతర్‌తో సోమవారం దౌత్య సంబంధాలు సహా అన్ని రకాల సంబంధాలను తెంచేసుకున్నట్టు ప్రకటించాయి. యెమన్, లిబియా, మాల్దీవులు కూడా తర్వాత ఆ జాబితాలో చేరాయి.

తాజా ఘటనపై భారత్ స్పందిస్తూ గల్ఫ్‌తో తమకున్న వ్యక్తిగత సంబంధాలపై ఇది ఎంతమాత్రమూ ప్రభావం చూపదని పేర్కొంది. అది గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్ (జీసీసీ) అంతర్గత విషయమని నొక్కి చెప్పింది. తమ ఆందోళనంతా అక్కడ నివసిస్తున్న భారతీయులపైనేనని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఆయా దేశాల్లో ఎవరైనా భారతీయులు చిక్కుకుపోయారా? అనే విషయమై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఖతర్‌లో మొత్తం 6.50 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితులు త్వరలోనే సద్దుమణుగుతాయని సుష్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖతర్‌తో తమ సంబంధాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

More Telugu News