: మరోసారి దేశం మీసం తిప్పడానికి సిద్ధమైన ఇస్రో.. కాసేపట్లో 'బాహుబలి' రాకెట్ ప్రయోగం!

ఘన విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకెళుతున్న ఇస్రో మరికాసేపట్లో మరో ప్రయోగం చేయడానికి సిద్ధమైంది. సాయంత్రం 5.28 గంటలకు అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 దూసుకెళ్లనుంది. దీని ద్వారా నింగిలోకి జీశాట్-19 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. అతి బరువైన ఈ రాకెట్ ను 'బాహుబలి' అంటూ ముద్దుగా అభివర్ణిస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఈ ప్రయోగం చేయనున్నారు.

ఈ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైతే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ఎంతో లాభ‌ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ప్ర‌యోగం భార‌త్‌కు ఎంతో ముఖ్య‌మైంద‌ని అంటున్నారు. ఈ ప్ర‌యోగం కోసం నిన్న‌ సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇది ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News