: వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.. పుట్టిన ఆరు గంటలకే చిన్నారికి గుండె ఆపరేషన్!

వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పుట్టిన ఆరు గంటలకే నవజాత శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్‌ చేశారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిన్నారిలోని గుండె నరాల్లో ఒకటి మూసుకుపోవడంతో దానిని సరిదిద్దేందుకు వైద్యులు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నవజాత శిశువుల్లోని నరాలు చాలా సున్నితంగా ఉంటాయని, వారిలో ఈ సమస్య సాధారణమేనని తెలిపారు.

అయితే ఈ ఆపరేషన్ చాలా సవాలుతో కూడుకున్నదని ఆస్పత్రి పీడియాట్రిక్ కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. చిన్నారి అద్విక పుపున నరం 80 శాతం వరకు మూసుకుపోయిందని, శస్త్రచికిత్స ఏమాత్రం ఆలస్యమైనా పాప ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలను గుర్తించడంలో విఫలమవడం కారణంగా వందలాదిమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు నీరజ్ చెప్పారు.

More Telugu News