: కూలిన యుద్ధ విమానంలోని పైలెట్లు ఏమయ్యారు?... బ్లాక్ బాక్స్ దొరికినా లభించని సమాచారం!

అసోం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత వాయుసేనకు చెందిన 'సుఖోయ్ 30' యుద్ధ విమానం కుప్పకూలిన విషయం నిర్ధారణ అయినప్పటికీ, అందులో ప్రయాణించిన ఇద్దరు పైలట్లు ఏమయ్యారన్న విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. విమానం బ్లాక్ బాక్స్ లభించి, అందులోని సమాచారాన్ని విశ్లేషించినప్పటికీ, పైలట్ల గురించిన సమాచారం లభించకపోవడంతో అధికారులు వారి ఆచూకీపై తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

విమానం ఆచూకీ కోసం బయలుదేరిన సెర్చ్ టీములకు అడవుల్లో బ్లాక్ బాక్స్ దొరికిందని తేజ్ పూర్ రక్షణ కార్యాలయం ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. విమానం శకలాల్లో పైలట్ల ఆచూకీ లభించలేదని, బ్లాక్ బాక్స్ లోనూ అందుకు సంబంధించిన సమాచారం లేదని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా, గత మంగళవారం నాడు తేజ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానం భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే.

More Telugu News