: షోషించలేని వాడివి పెళ్లెందుకు చేసుకున్నావ్?... భరణం కేసులో కోర్టు కీలక తీర్పు

భార్యను పోషించలేని స్థితిలో ఉన్న వ్యక్తికి వివాహం ఎందుకని ఢిల్లీ కోర్టు ప్రశ్నించింది. విడాకులు తీసుకున్న ఓ జంటలో, తాను పేదవాడినైనందున నెలవారీ జీవన భృతిని చెల్లించలేనని ఓ వ్యక్తి పెట్టుకున్న పిటిషన్ పై విచారించిన కోర్టు మాజీ భార్యకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆమెకు నెలకు రూ. 7,500 ఇవ్వాల్సిందేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తున్నట్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ పేదవాడైతే, పెళ్లెలా చేసుకున్నాడని ప్రశ్నించిన న్యాయమూర్తి, విడాకులు ఇచ్చిన తరువాత కూడా ఆమె జీవనం సాఫీగా సాగేందుకు పిటిషనర్ డబ్బులు ఇవ్వాల్సిందేనని కీలక తీర్పిచ్చారు.

More Telugu News