: భారత్ లో యూనివర్సిటీల తీరిది... అన్నీ కలిపినా కేంబ్రిడ్జికి సాటిరావు!

భారత్ లోని యూనివర్సిటీ స్థాయి విద్యావిధానంలో మార్పులు చాలా అవసరమని, సమాజానికి అవసరమైన పరిశోధనలు మరిన్ని జరగాలని నిపుణులు పలు సందర్భాల్లో పేర్కొంటారు. అలాగే భారత్ లో విద్యావిధానం నాసిరకంగా ఉందని, యూనివర్సిటీల స్థాయి మరింత దిగజారుతోందని పలు సందర్భాల్లో మేధావులు, నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. దీనిపై ఒక సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం కోసం భారత్ లోని పేరున్న యూనివర్సిటీలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు.

విచిత్రం ఏమిటంటే, భారత్ లోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కలిపినా ప్రపంచ టాప్ 2 యూనివర్సిటీలైన కేంబ్రిడ్జ్ (ఇంగ్లండ్), స్టాన్ ఫోర్డ్ (అమెరికా) యూనివర్సిటీల స్థాయికి రావని తేలింది. దీనికి కారణం భారతీయ యూనివర్సిటీల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు తీవ్రమైన నిధుల కొరత అని ఈ అధ్యయనంలో తేలింది. ఎవరైనా కష్టపడి సరికొత్త ఆవిష్కరణ చేసినా వారికి సరైన ప్రోత్సాహకాలు అందించడంలో యూనివర్సిటీలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు. భారత్ లో కొత్తగా ఏర్పాటైన యూనివర్సిటీలతో పోలిస్తే...బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ), ఢిల్లీ యూనివర్సిటీ వంటి వాటిలో ప్రమాణాలు బాగున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు తెలిపారు.

More Telugu News