: కోలారు జిల్లాలో బాంబులేశారా? అన్నట్టు కురిసిన వడగళ్లు

కర్ణాటకలోని కోలారు జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీనికి తోడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ వడగళ్లు పడ్డాయి. ఆకాశం నుంచి సుమారు 20–30 కేజీల బరువున్న భారీ మంచుగడ్డలు పడుతుండడంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. బాంబులేశారా? అన్నట్టు కురిసిన ఈ వడగళ్ల వాన ధాటికి పాలీహౌస్‌ లు నామరూపాల్లేకుండా ధ్వంసం కాగా, వంకాయ, బెండకాయ, క్యాప్సికం, టమాటా వంటి ఉద్యాన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో, రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

More Telugu News