: నష్టపోవాలనుకుంటేనే మరో క్షిపణిని పరీక్షించండి: ఉత్తర కొరియాకు జీ-7 సీరియస్ వార్నింగ్

తీవ్రంగా నష్టపోవాలని, దేశ ప్రజలను ఇబ్బందులు పెట్టాలని భావిస్తేనే మరోమారు క్షిపణి పరీక్షలు చేయాలని ఉత్తర కొరియాకు అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-7 తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా ఏడు దేశాల అధినేతలు సమావేశమైన వేళ, ఉత్తర కొరియా చేస్తున్న ప్రయోగాలపై చర్చ జరిగింది. కొరియా తీరును తీవ్రంగా తప్పుబట్టిన అగ్రదేశాల అధినేతలు, ఇప్పటికైనా కిమ్ జాంగ్ ఉన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ప్రపంచ వినాశనాన్ని కోరుకునే చర్యలు వద్దని హితవు పలికారు. దుందుడుకు తనంతో చేస్తున్న పనులు విపత్తుకు దారితీస్తాయని హెచ్చరించారు.

More Telugu News