: సినిమా టికెట్లపై జీఎస్‌టీ ప్రభావం నిల్!

సినీ ప్రియులకు ఇది తీపి కబురే. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి రూ.250 కంటే తక్కువ ధర కలిగిన టికెట్లకు పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో సినిమా టికెట్ల ధరలు పెరిగే అవకాశం లేదు. అయితే సినిమా హాళ్ల మీద మాత్రం 28 శాతం పన్ను విధించారు. అయితే థియేటర్లపై పన్ను ఉంటుంది కాబట్టి టికెట్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల ధరలు పెరుగుతాయి కాబట్టి ఆ రకంగా చూస్తే సినిమా కొంచెం భారంగా మారుతుందనే చెప్పాలి. సినిమాను విలాస సేవల కింద పరిగణించడం ఆశ్చర్యంగా ఉందని పీవీఆర్ లిమిటెడ్ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ నితిన్‌సూద్ తెలిపారు. ప్రస్తుతం 0 నుంచి 10 శాతం వినోద పన్నును చెల్లిస్తుండగా దానిని 28 శాతానికి పెంచడం ఆశ్చర్యం కలిగించే విషయమని నితిన్ పేర్కొన్నారు.

More Telugu News