: మన దేశంలో ఏటీఎంలు సేఫ్: ఆర్బీఐ

ర్యాన్సమ్ వేర్ వైరస్ మన దేశంలోని ఏటీఎంలపై ఎలాంటి ప్రభావం చూపలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పేర్కొంది. ర్యాన్సమ్ వేర్ వైరస్ ను ఎదుర్కొనే పటిష్టమైన యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉందని పేర్కొంది. బ్యాంకుల్లోని కంప్యూటర్లలో ప్రస్తుతం వాడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ డేట్ చేయాలని, అదేవిధంగా, ఏటీఎంలను కూడా అప్ డేట్ చేయాలని ఆదేశించామన్నారు. ఎందుకంటే, అరవై శాతనికి పైగా ఏటీఎంలు ఔట్ డేటెడ్ విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టంపైనే నడుస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కాగా,ర్యాన్సమ్ వేర్ వంటి వైరస్ లు ఏటీఎంలను హ్యాక్ చేయలేవని, ఏటీఎం మెషీన్ లో ఎలాంటి డేటా ఉండదని నిపుణులు తెలిపారు.

More Telugu News