: ఐటీ కంపెనీలకు మరో షాక్.. అప్రమత్తంగా ఉండాలంటున్న విశ్లేషకులు

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అతలాకుతలమైన ఐటీ రంగానికి మరో పెద్ద ముప్పు వచ్చి పడింది. మన రూపాయే మన ఐటీ కంపెనీలకు వణుకు పుట్టిస్తోంది. గత కొంత కాలంగా అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి మారక విలువ బలపడుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 5.6 శాతం జంప్ అయింది. ఇదే ఇప్పుడు ఐటీ కంపెనీలకు దడ పుట్టిస్తోంది. మన ఐటీ కంపెనీల రెవెన్యూలో 90 శాతం అమెరికా నుంచే వస్తోంది. రూపాయి విలువ బలపడుతుండటంతో... ఈ కంపెనీల ఆదాయం విలువ తగ్గిపోతోంది.

ఈ సందర్భంగా రిలయన్స్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ రాకేష్ థార్వే మాట్లాడుతూ, రూపాయి విలువ పెరగడం ఐటీ కంపెనీలకు ఆందోళనకరంగా మారిందని చెప్పారు. రూపాయి విలువ 1 శాతం పెరిగితే ఐటీ కంపెనీల మార్జిన్లు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు తుడిచిపెట్టుకు పోతాయని తెలిపారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News