: ముంబయ్ లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తే... పోర్న్ సైట్స్ చూస్తున్నారు!

డిజిటల్ ఇండియాగా భారత్ ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ ఇండియా దిశగా భారత్ ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉచిత వైఫైను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా పని చేశాయి. దీంతో ప్రతి రాష్ట్రంలోనూ ప్రధాన పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చారు.

ఈ క్రమంలో, భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయి నగరంలో 510 ప్రాంతాల్లో మూడు లక్షల మంది ప్రజలు వినియోగించుకునేలా ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే దీని కారణంగా, పది శాతం మంది అంటే 30,000 మంది పోర్న్ సైట్లు, వీడియోలు, చిత్రాలు చూస్తున్నారని మహారాష్ట్ర ఐటీ శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు చూసి షాక్ కు గురైన ఐటీ అధికారులు తలపట్టుకుంటున్నారు. ఫోర్న్ సైట్స్ ను బ్లాక్ చేస్తున్నప్పటికీ కొత్త డొమైన్ పేర్లతో అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయని వాపోతున్నారు. 

More Telugu News