: అలాంటి పీహెచ్ డీలు చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే: నరసింహన్

విలువలతో కూడిన విద్య ప్రస్తుత కాలంలో చాలా అవసరమని గవర్నర్ నరసింహన్ అన్నారు. కట్ అండ్ పేస్ట్ టైప్ పీహెచ్ డీలతో ఏమాత్రం ఉపయోగం లేదని తెలిపారు. ఇలాంటి పీహెచ్ డీలు చేసినా ఒకటే... చేయకపోయినా ఒకటే అని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలకు సంబంధించిన వాటిపై పరిశోధనలు జరగాలన్నారు. నాణ్యమైన విద్యకు యూనివర్శిటీలు పెద్దపీట వేయాలని అన్నారు. ఆచార్య దేవోభవ అనే భావాన్ని ఎవరూ మర్చిపోకూడదని చెప్పారు. డబ్బు సంపాదన కోసమే విద్య అనే భావన నుంచి యువత బయటకు రావాలని తెలిపారు. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన అధ్యాపకులను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 

More Telugu News