: ఐపీఎల్ సీజన్-10 లో ఇప్పటి వరకు ఆకట్టుకున్న దేశవాళీ ఆటగాళ్లు వీరిద్దరే...!

ఐపీఎల్ సీజన్-10లో ఇద్దరు దేశవాళీ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. ఒకరు జూనియర్ జట్టు సభ్యుడైన రిషబ్ పంత్ కాగా...రెండో వ్యక్తి అనూహ్యంగా ఐపీఎల్ లో స్థానం సంపాదించిన రాహుల్ త్రిపాఠి. రిషబ్ పంత్ ధోనీ వారసుడిగా ఆశలు రేకెత్తిస్తున్నాడు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందినవాడు మాత్రమే కాకుండా....కీపింగ్, బ్యాంటింగ్ లో ధోనీకి సరితూగే ఆటగాడని విశ్లేషకులు ప్రశంసలు పొందుతున్నాడు.

ఇక రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ లో పూణే సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసినంతవరకు పెద్దగా ఎవరికీ తెలియని ఆటగాడు. పూణే ఆడిన మ్యాచ్ లలో చివర్లో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ పై కెప్టెన్ స్మిత్ నమ్మకముంచాడు. దీంతో ఓపెనర్ గా రహానేకు జోడీగా రాహుల్ ను దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చెయ్యని రాహుల్ త్రిపాఠి....కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి సత్తాచాటాడు. మ్యాచ్ లో 93 పురుగుల వద్ద అవుటై సెంచరీ మిస్సయ్యాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్ లో భారత జట్టుకు దొరికిన తారలుగా ప్రశంసలు అందుకుంటున్నారు. 

More Telugu News