: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన అమెజాన్!

భారత్‌లోని నిరుద్యోగుల‌కు ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ శుభ‌వార్త చెప్పింది. ఈ ఏడాది కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న 41 వేర్ హౌజ్ ల కోసం సుమారు 5 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్ల‌డించింది. భార‌త్‌తో తాము నూత‌నంగా ఏడు గిడ్డంగులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. వీటిల్లో ప‌నిచేసేందుకే నియామ‌కాలు చేప‌డుతున్న‌ట్లు చెప్పింది. భారత మార్కెట్లోకి 5 బిలియన్ డాలర్ల(రూ.32,091కోట్లకు పైనా) పెట్టుబడులు పెట్టాలని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ అమెజాన్.. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తోంది.

భార‌తీయ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ నుంచి అమెజాన్ విప‌రీత‌మైన పోటీని ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. పోటీని అధిగమించడానికి అమెజాన్ తన పెట్టుబడులను భారీగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. కాగా, పెట్టుబడుల వివరాలను ప్రకటించడానికి ఆ కంపెనీ నిరాకరించింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ల‌లో అమెజాన్ కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనుంది.

More Telugu News