: భారత్ జవాన్లపై పాకిస్థానీ 'బ్యాట్' పైశాచికం సాగిందిలా!

జమ్మూ కాశ్మీర్, పాకిస్థాన్ మధ్య 778 కిలోమీటర్ల దూరం ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సైనిక దళాల చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆదివారం నాడు వాస్తవాధీన రేఖను సందర్శించిన 24 గంటలు గడవకుండానే ఆ దేశానికి చెందిన బ్యాట్ (బార్డర్ యాక్షన్ టీమ్) రంగంలోకి దిగింది. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టారులోకి చొరబడింది. ఓ వైపు నుంచి పక్కనే ఉన్న పోస్టులపై పాక్ వైపు నుంచి భారీ ఎత్తున కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతుండగా, బ్యాట్ టీము సభ్యులు సరిహద్దులు దాటి సుమారు 200 మీటర్ల దూరం చొరబడ్డారు.

ఆ సమయంలో కాపలాగా ఉన్న ఇద్దరు భారత జవాన్లను చూసి వారిపై దాడి చేశారు. పరిస్థితి అర్థమయ్యే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారిద్దరినీ దారుణంగా హత్య చేసి తలలు నరికి వేశారు. కేవలం మొండేలను అక్కడ పడేసి, వచ్చిన దారినే వెనక్కెళ్లి పోయారు. వారి తలలను వెంట తీసుకెళ్లారా? లేక మరేమైనా చేశారా? అన్న విషయమై సమాచారం లేదు. బ్యాట్ టీమ్ పక్కా ప్రణాళికతో వ్యవహరించి, ఇండియాపై దాడి చేసి, ఇద్దరిని బలిగొని క్షేమంగా వెనక్కెళ్లి పోవడాన్ని ఇప్పుడు భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది.

More Telugu News