: ఏపీపై బీజేపీ నజర్... విజయవాడకు వచ్చి 75 వేల మందితో సమావేశం కానున్న అమిత్ షా

ఉత్తరాదితో పాటు ఈశాన్య భారతావనిలో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు తమకు నామమాత్రం ప్రాతినిధ్యమున్న దక్షిణాదిపై కన్నేసింది. కర్ణాటక మినహా, మరే రాష్ట్రంలోనూ అధికారానికి చేరువయ్యేంత బలం లేని బీజేపీ, ఆ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బలోపేతం కావడం, ప్రజల్లోకి దూసుకెళ్లే నేతలను గుర్తించి, వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ పర్యటన ఖరారైంది.

ఈ నెల 25న విజయవాడకు రానున్న అమిత్ షా ఓ భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సుమారు 75 వేల మంది బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం కానున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ ప్రతినిధులు హాజరవుతారని, వారికి అమిత్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకూ తెలుగుదేశంతో పొత్తు కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నదే బీజేపీ అధిష్ఠానం ఉద్దేశమని సమాచారం.

More Telugu News