: కిమ్ జోంగ్ ఉన్‌ను కలుస్తా.. అది నాకు గౌరవం కూడా.. తలుపులు తెరిచిన ట్రంప్!

కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ను ‘సరైన సమయం’లో కలుస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతనిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘కిమ్‌ను కలవడం సరైనదని అనిపిస్తే తప్పకుండా ఆ పని చేస్తా. అలా చేయడాన్ని గౌరవంగా భావిస్తా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే ఆయనను కలిసేందుకు ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఎప్పుడు కలుస్తాను.. అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పటికిప్పుడైతే ఆ పరిస్థితులు లేవని, మీటింగ్‌కు ముందు ఉత్తరకొరియా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తర్వాత వైట్‌హౌస్ ప్రకటించింది. కాగా, కిమ్‌ను కలుస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

More Telugu News