: ఐదేళ్లలో రూ.23 వేల కోట్ల నల్లధనం చలామణి.. 17 వేల మంది సీఏలపై చర్యలకు సిద్ధమవుతున్న ఈడీ

ఐదేళ్ల కాలంలో రూ.23 వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు 17 వేల మంది చార్టెడ్ అకౌంటెంట్లు ప్రయత్నించారని భావిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీవోఐ)లు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. అనుమానిత కంపెనీల ద్వారా అక్రమంగా నగదు చలామణి చేయించిన వ్యవహారంలో వీరి ప్రమేయం ఉంటుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

షెల్ కంపెనీలు నల్లధనాన్ని చలామణి చేసేందుకు చట్టబద్ధమైన ముసుగుకు వీరంతా సహకరించారన్న ఆరోపణలున్నాయి. కాగా, అక్రమ ఆరోపణలపై దేశవ్యాప్తంగా పదిమంది సీఏలను ఆదాయపు పన్ను విభాగం అరెస్ట్ చేసింది. అక్రమ నగదు చలామణికి సహకరిస్తున్నారంటూ మరో 34 మంది సీఏల పేర్లను చార్టెడ్ అకౌంటెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు మార్చిలో ప్రభుత్వం అందజేసింది.

More Telugu News