: రఘునందన్‌కు ఉరి సబబే.. ఉరిపై నిషేధం ఉన్నా సమర్థించిన హైకోర్టు

అమెరికాలో 2012లో పదేళ్ల చిన్నారి శాన్వి, అడ్డొచ్చిన ఆమె అమ్మమ్మ సత్యవతిని దారుణంగా హత్య చేసిన భారతీయ టెకీ రఘునందన్ యండమూరికి ఉరి శిక్ష సబబేనని పెన్సిల్వేనియా హైకోర్టు సమర్థించింది. ఈ రాష్ట్రంలో ఉరిశిక్షలపై నిషేధం ఉన్నా జ్యూరీ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు రఘునందన్‌కు అది సరైన శిక్షేనని అభిప్రాయపడింది. చేసిన అప్పులు తీర్చేందుకు స్నేహితుడి కూతురైన శాన్విని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె అమ్మమ్మ సత్యవతిని హతమార్చాడు. కిడ్నాప్ చేసే ప్రయత్నంలో శాన్వి ముఖంపై గట్టిగా అదిమి పట్టుకోవడంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని రఘునందన్‌ను చూసి జ్యూరీ సభ్యులు సైతం అప్పట్లో ఆశ్చర్యపోయారు.

More Telugu News