: నిజామాబాద్ ఎంపీ వస్తున్నారంటేనే అరెస్టులు మొదలు!: కోదండరామ్ విమర్శలు

ఒక ఎంపీ వస్తున్నారంటే, అక్కడి ప్రజలు సాదరంగా స్వాగతం పలకాలి. కానీ నిజామాబాద్ ఎంపీ వస్తున్నారంటే, ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ఎక్కడ ఎంపీ పర్యటనను అడ్డుకుంటారోనని వారిని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఇదెంత వరకూ సబబు? అని జేఏసీ నేత కోదండరామ్, ఎంపీ కవిత పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ఎంపీ బోధన్ పర్యటనకు బయలుదేరిన వేళ, అక్కడి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను, ముందు జాగ్రత్త చర్యలంటూ అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

జాతీయ భూసేకరణ చట్టం 2013ను మాత్రమే కొనసాగించాలని, దానికి సవరణలు చేస్తే, అంగీకరించబోమని అన్నారు. మరోసారి  చట్ట సవరణలకు ప్రభుత్వం ప్రయత్నించి, అసెంబ్లీని సమావేశపరచడాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నిరసన దీక్షలు చేపట్టనున్నామని అన్నారు. తమ నిరసన మఖ్దూం భవన్ వేదికగా జరుగుతుందని అన్నారు.

More Telugu News