: టీమిండియా క్రికెటర్లకు ఆర్నెల్లుగా జీతాల్లేవట!

ఈ సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రతిభను కనబరిచారు. ప్రతి టెస్ట్ సిరీస్ ను ఇండియా గెలుచుకుంది. న్యూజిలాండ్ తో మొదలైన విజయపరంపర ఆస్ట్రేలియా సిరీస్ వరకు కొనసాగింది. దీంతో, ఆటగాళ్లకు బీసీసీఐ నజరానా కూడా ప్రకటించింది. అయితే, గత ఆరు నెలలుగా టీమిండియా ఆటగాళ్లకు జీతాలు అందలేదట. ఈ విషయాన్ని స్వయంగా ఓ క్రికెటర్ చెప్పాడు. కాంట్రాక్ట్ ప్రకారం టెస్ట్ మ్యాచ్ కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి 3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఆటగాడికి రూ. కోటి వరకు అందాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు నియమించిన కమిటీనే ప్రస్తుతం బోర్డు ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటోంది. వాళ్ల అనుమతి లేకుండా బీసీసీఐకి ఒక్క రూపాయి కూడా విడుదలయ్యే అవకాశం లేదు. మరోవైపు ఐసీసీ, బీసీసీఐకి మధ్య నడుస్తున్న యుద్ధం కూడా జీతాల చెల్లింపు లేట్ కావడానికి కారణంగా తెలుస్తోంది. 

More Telugu News