: రూ.10 కోట్లయినా ఇస్తామంటారు.. తమ పార్టీలోకి రమ్మని ఫోన్‌ చేస్తే ఆ కాల్స్‌ను రికార్డు చేయండి: కేజ్రీవాల్‌

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో త‌మ పార్టీ నుంచి నేత‌లు జారిపోకుండా ఆప్ నేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నుంచి ఎన్నికైన 48 మంది కౌన్సిలర్లతో ఈ రోజు ఆయ‌న స‌మావేశ‌మై వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. పార్టీ నుంచి జంప్ కాబోన‌ని ప్ర‌మాణం చేయాల‌ని ఆయ‌న కోరారు. అలాగే కౌన్సిల‌ర్లంతా నిజాయ‌తీగా న‌డుచుకోవాల‌ని అన్నారు.

ఒకవేళ ఇతర సభ్యులెవరైనా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైనా ఇవ్వజూపుతూ ఫోన్‌ చేస్తే అలాంటి కాల్స్‌ను రికార్డు చేయాలని ఆయ‌న చెప్పారు. ఇత‌ర పార్టీల వారు ఒక్కోసారి రూ.10 కోట్లకు పైగా ఇస్తాన‌ని ప్ర‌లోభ‌పెట్టవ‌చ్చ‌ని, దాన్ని తిరస్కరించాల‌ని ఆయ‌న అన్నారు. ఒకవేళ అలా కాద‌ని ఆ డ‌బ్బు తీసుకుంటే జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయ‌న అన్నారు.

More Telugu News