: 8 నెలలకే 17 కేజీల బరువు పెరిగిన బాలిక!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన చాహత్‌కుమార్‌ అనే బాలిక వయసు 8 నెలలు. అయితే, ఈ వ‌య‌సులో ఆ చిన్నారి బరువు ఏకంగా 17 కేజీలుగా ఉంది. ఈ వ‌య‌సులో 6 నుంచి 9 కేజీల బ‌రువు ఉండాల్సిన త‌మ కూతురు రోజు రోజుకీ బ‌రువు పెరిగిపోతుండ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. నాలుగు నెల‌ల వయ‌సు వ‌చ్చే వ‌ర‌కు సాధార‌ణంగానే బ‌రువు ఉన్న త‌మ కూతురు ఆ తర్వాత నుంచి అసాధార‌ణంగా బ‌రువు పెరిగిపోతోంద‌ని చెబుతున్నారు.

అంతేకాదు, తిండి కూడా 10 ఏళ్ల వయసున్న అమ్మాయిలా అధిక మోతాదులో తింటోంది. ఆ చిన్నారి శరీరంలో కొవ్వు భారీగా పేరుకుపోతోంద‌ని, పౌష్టికాహార నిపుణులను సంప్రదించాలని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పామ‌ని అక్క‌డి వైద్యులు చెప్పారు. ఆ పాప‌కు రక్తపరీక్ష కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామ‌ని అన్నారు. ఆ బాలిక తండ్రి సూరజ్‌కుమార్ మాట్లాడుతూ.. త‌మ కూతురికి ఆకలి బాగా ఉంటుంద‌ని తెలిపారు. త‌మ చిన్నారి సాధార‌ణ స్థితికి రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆమె తల్లి రీనూ కుమార్ అన్నారు.

More Telugu News