: షార్ కి చేరిన 37 దేశాల ఉపగ్రహాలు...పరీక్షలకు సిద్ధం

నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరుపేటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ కు (షార్‌) విదేశాల నుంచి ఉపగ్రహాలు చేరినట్టు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరిన వీటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నేటి వేకువజామున షార్‌ కు తీసుకొచ్చి, క్లీన్‌ రూమ్‌ లో ఉంచినట్టు తెలిపారు. మొత్తం 37 దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఇక్కడకి చేరుకున్నాయని, వాటన్నింటికీ వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. వాటిలో విజయవంతమైన అనంతరం, మరోసారి నిర్ధారించుకుని, అంతరిక్ష వాహకనౌకకు అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 25న షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ38 వాహకనౌకను 37 విదేశీ ఉపగ్రహాలతో పాటు, మనదేశానికి చెందిన కార్టోశాట్ ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపి, కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News