: గంగానది, త్రివర్ణ పతాకం, ఆవు.. రాముడివి... ఉరిశిక్షకైనా రెడీ: ఉమాభారతి

గంగానది, త్రివర్ణ పతాకం, ఆవు.. రాముడివని కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు ఘటనపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇందుకోసం పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

అయోధ్య కోసం ఉరిశిక్షకైనా తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో కుట్రేమీ లేదని తెలిపిన ఆమె, అంతా బహిరంగంగానే జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నైతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి వంటి నేతల విద్వేషపూరిత ప్రసంగాల వల్లే బాబ్రీ మసీదును కూల్చేసినట్టు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

More Telugu News